తలకు మించిన భారంగా శర్వానంద్ మూవీ
శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. గత కొంతకాలంగా ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ కు ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది. శర్వా మార్కెట్ పడిపోవడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ రావడం కూడా కష్టమే.
ఇదిలా ఉంటే శర్వా, శ్రీరామ్ ఆదిత్య కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తైంది. మరో 30% పెండింగ్ ఉందట. ఈ సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం సినిమా పూర్తయ్యే నాటికి ఈ సినిమాకు 40-50 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశాలున్నాయట.
శర్వానంద్ పై ఈ రేంజ్ బడ్జెట్ అంటే చాలా ఎక్కువే. శర్వా మార్కెట్ ను బట్టి చూసుకుంటే ఈ రేంజ్ కలెక్షన్స్ ను శర్వా మూవీకి ఆశించలేం కూడా. పోనీ డైరెక్టర్ ఏమైనా హిట్ ట్రాక్ లో ఉన్నాడా అంటే అదీ లేదు. ఆయనది కూడా శర్వా లాంటి ట్రాక్ రికార్డే. ఏదేమైనా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇలాంటి మీడియం రేంజ్ హీరోల బడ్జెట్ విషయంలో ఇకనైనా జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోవడం తప్పదని ట్రేడ్ పండితులు అంటున్నారు.













