అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ టాక్
పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ అల్లు శిరీష్ చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. సినిమాలు చేస్తున్నా ఎక్కువగా ఫ్లాపులే అవడంతో కొన్నాళ్ల పాటూ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు టెడ్డీ అనే సినిమాతో శిరీష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ వాయిదా పడుతూ వచ్చింది.
టీమ్ మొత్తం సినిమాలో కంటెంట్ గట్టిగా ఉందని చెప్తోంది. తాజాగా మేకర్స్ టెడ్డీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే శిరీష్ ఈసారి ఏదో కొత్తగా ట్రై చేశాడనిపిస్తోంది. రెండున్నర నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కథను దాచకుండా మొత్తం ట్రైలర్ లోనే రివీల్ చేశారు. హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్న ఎయిర్ పైలెట్ ఆదిత్య రామ్ (అల్లు శిరీష్) వల్ల నష్టపోయానని విలన్ (అజ్మల్) భావిస్తాడు. దీంతో ఆదిత్యకు సమస్యలు స్టార్ట్ అవుతాయి.
ఎక్కడో దూరంగా కనిపించిన చోట ఉండే అతని డెన్ కు ఆదిత్య ఒంటరిగా వెళ్లే సిట్యుయేషన్ వస్తుంది. అప్పుడక్కడ మాట్లాడే, నడిచే టెడ్డి బేర్ ఆదిత్యకు తోడవుతుంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యేక్షమయ్యే ఈ బొమ్మ రాకాసిని తీసుకెళ్లిన ఆదిత్య చివరకు అక్కడి నుంచి ఎలా బయటపట్టాడనేది సినిమా కథగా తెలుస్తోంది. మ్యూజిక్, గ్రాఫిక్స్, క్యాస్టింగ్ చూస్తుంట కొత్తగానే అనిపిస్తుంది. మరి ఈ సినిమా శిరీష్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













