RC16: ఆర్సీ16 కోసం గురువు బాటలో బుచ్చిబాబు
గేమ్ ఛేంజర్(Game Changer) డిజాస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్ కెరీర్లో 16(RC16)వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. రామ్ చరణ్ సైతం ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆర్సీ16ను బుచ్చిబాబు చాలా మంచి కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర అల్టిమేట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తోంది. అయితే ఆర్సీ16 కోసం బుచ్చిబాబు తన గురువు సుకుమార్ (Sukumar) బాటలో వెళ్ళనున్నాడని తెలుస్తోంది.
రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం(Rangasthalam) సినిమాలో క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. రంగస్థలం క్లైమాక్స్ ఆ సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేసిందని అందరూ అంటుంటారు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా ఆర్సీ16 కోసం అలాంటి నెక్ట్స్ లెవెల్ లో ఉండే క్లైమాక్స్ రాసుకున్నాడని, చాలా కాలం పాటూ ఈ సినిమా క్లైమాక్స్ అందరికీ గుర్తుండిపోతుందని చిత్ర సభ్యులు చెప్తున్నారు. చూస్తుంటే బుచ్చిబాబు చరణ్ కోసం ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టనిపిస్తోంది.













