ప్లాన్ మార్చేసిన బుచ్చిబాబు
ప్రస్తుతం శంకర్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను బుచ్చిబాబు సానతో చేయనున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ దీనికి సంగీతం అందించనున్నాడు.
మామూలుగా దసరా తర్వాత నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఇప్పుడు బుచ్చిబాబు తన ప్లాన్ ను మార్చినట్లు తెలుస్తోంది. మొన్నీ మధ్యే తండ్రిని కోల్పోయిన బుచ్చిబాబు, ఓ ఆరు నెలల పాటూ టైమ్ తీసుకోవాలనుకుంటున్నాడట. చరణ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది వచ్చే ఏడాది ఫస్టాఫ్ లోనే. ఈలోపు సినిమాకు సంబంధించిన మిగిలిన వర్క్ కూడా పూర్తయ్యేలా బుచ్చిబాబు టీమ్ ప్లాన్ చేస్తుందట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో చరణ్ కొత్త లుక్ లో కనిపిస్తాడని, మరోసారి ఈ సినిమాతో చరణ్ తన సత్తా చాటతాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ బాగా వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.













