గ్రామంను సెట్ చేసే పనిలో బుచ్చిబాబు
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. గేమ్ ఛేంజర్ పూర్తి కాగానే రామ్ చరణ్ బుచ్చిబాబు తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇప్పటికే చరణ్ ఈ విషయమై బుచ్చిబాబుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించనున్న మూవీ అతని చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కనుంది.
అయితే ఆర్సి16కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను బుచ్చిబాబు మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట ప్రచారమవుతుంది. ఈ సినిమాలో ఎక్కువ సీన్స్ పల్లెటూరి నేపథ్యంలోనే ఉండనున్నాయట. దానికోసం ఓ భారీ పల్లెటూరు సెట్ ను నిర్మిస్తున్నారట చిత్ర బృందం. అంతేకాదు ఈ సెట్ ను వేస్తుంది సిటీ అవుట్స్కర్ట్స్ లో కాదట.
సిటీకి మధ్యలో, అది కూడా చరణ్ ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలో విశాలమైన ప్లేస్ లో ఒక గ్రామంను ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు నిర్మిస్తున్నాడట. సినిమాలో మెజారిటీ సీన్స్ ఆ సెట్ లోనే చేయాలి కనుక ఎక్కువ ఖర్చు చేసి ఎంతో డీటెయిలింగ్ గా ఆ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.













