బ్రో కు బజ్ ఎక్కడ?
పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే ఆ హంగామా, ఆ హడావుడినే వేరు. నెల రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ నెట్టింట నానా రచ్చ చేస్తుంటారు. కానీ పవన్ ప్రధాన పాత్రలో వస్తున్న బ్రో సినిమా విషయంలో మాత్రం పైన చెప్పిందేమీ జరగట్లేదు. మరో 15 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు మేకర్స్.
పవన్ తో కేవలం 25 రోజుల్లో సినిమాను కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మేకర్స్ అందరికీ షాకిచ్చారు. వీలైనంత త్వరగా సినిమాను ఫినిష్ చేశారు. ఈ సినిమాకు వినోదాయ సీతం ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సముద్రఖనినే దర్శకత్వం వహించడం వల్ల అనుకున్నట్లే సినిమాను చాలా త్వరగా ఫినిష్ చేయగలిగారు.
అనుకున్న విషయాలన్నింటిలోనూ సక్సెస్ అయిన బ్రో మేకర్స్, సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. రిలీజ్ కు రెండు వారాలుండగా ఇప్పుడు సినిమాలోని సాంగ్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో వస్తున్న సినిమా అంటే ఇప్పటికే క్రేజ్ భారీ రేంజ్లో వచ్చి ఉండాలి.
కానీ మేకర్స్ బ్రో సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. అన్నింటినీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న మేకర్స్, ప్రమోషన్స్ విషయంలో సరిగా ప్లాన్ చేసుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరి ఈ రెండు వారాల్లో అయినా బ్రో సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.













