బ్రో సినిమా హైలైట్స్ అవే..
పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ వినోదాయ సిత్తంకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ రచనా వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేట్లు మార్చడంలో త్రివిక్రమ్ పాత్ర చాలానే ఉందట.
పవన్ కనిపించే సీన్స్ అన్నింటికీ త్రివిక్రమ్ స్వయంగా డైలాగ్స్ రాయడంతో పాటూ సినిమా స్క్రీన్ ప్లే ను కూడా పర్యవేక్షించాడని సమాచారం. పవన్ కళ్యాణ్ చెప్పే ఎమోషన్ డైలాగ్స్, నైతిక విలువలకు సంబంధించిన డైలాగ్స్ మాత్రమే కాకుండా పొలిటికల్ పంచ్ డైలాగ్స్ కూడా సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ కానున్నాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
సాయి తేజ్- పవన్ మధ్య వచ్చే సీన్స్, డైలాగ్స్ మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి బ్రో సినిమాకు త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ ప్లే బ్రో సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని తెలుస్తోంది. పవన్ గత రీమేక్ సినిమా భీమ్లా నాయక్ విషయంలో కూడా త్రివిక్రమ్ పాత్ర చాలానే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే తరహాలో మంచి హిట్ గా నిలవడం ఖాయంటున్నారు పవన్ ఫ్యాన్స్.













