బ్రో రన్ ఎంతంటే..?
మరో పదిహేను రోజుల్లో రిలీజ్ కానున్న బ్రో సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా లెంగ్త్‌ని 2 గంటల 15 నిమిషాలకు లాక్ చేయడం ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది. సాధారణంగా పవన్- సాయి తేజ్ కాంబోలో వస్తున్న సినిమా అంటే ఎవరైనా ఎక్కువ రన్ టైమ్‌నే ఆశిస్తారు కానీ బ్రో మేకర్స్ ఇలా షార్ట్ టైమ్ లాక్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ 20 నిమిషాల తర్వాత ఉంటుందని ఇప్పటికే ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది. పవన్ క్యారెక్టర్ నిడివి దాదాపు 90 నిమిషాలు ఉండనుందని, ఈ నేపథ్యంలోనే బ్రో రన్ టైమ్‌ను క్రిస్పీగా ఉండేలా సెట్ చేశారని తెలుస్తోంది. ఇలాంటి క్రేజ్ ఉన్న సినిమాకు రన్ టైమ్ తక్కువ ఉండటం పాజిటివ్ విషయమనే చెప్పాలి.
సినిమాకు ప్రమోషన్ల రూపంలో పెద్దగా హడావిడి చేయకపోయినా బ్రో కు బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్లు సమాచారం. నైజామ్ రైట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ 32 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్ర రైట్స్ ను కూడా ఫైనలైజ్ చేయనున్నారు మేకర్స్. ఇలాంటి సందర్భంలో బ్రో కు పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇక కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. దానికి తోడు బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరో మూవీ వచ్చి చాలా రోజులైంది కాబట్టి ఈ విషయం బ్రో కు కలిసి వచ్చే ఛాన్సుంది. మరి జులై 28న రిలీజ్ కానున్న బ్రో ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి













