దగ్గుబాటి వారి పెళ్ళికొడుకు పెళ్ళికి రెడీ
రానా దగ్గుబాటి – మిహికా బజాజ్ ఈ రోజే (శనివారం) మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే తాజాగా రానా పెళ్లి విషయమై స్పందించిన సురేష్ బాబు..కరోనా వైరస్ కారణముగా అందరిని ఆహ్వానించడానికి అవకాశం లేకుండా పోయింది అతి తక్కువ మంది తో ఈ పెళ్లివేడుక జరుగనుంది కాస్త బాధగావుంది కూడా అన్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ రోజే (ఆగస్టు 8) రానా- మిహికా వివాహ వేడుక జరగనుంది. వేదమంత్రాల నడుమ అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్న ఘనంగా జరగనున్న ఈ వేడుకకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. ఈ మేరకు రామానాయుడు స్టూడియోలో అన్ని సదుపాయాలతో పెళ్లి ఏర్పాట్లు, కళ్ళు చెదిరే డెకరేషన్ చేయించారట రానా తండ్రి సురేష్ బాబు.













