హీరోయిన్లకు బాధ్యత లేదా?
లాక్ డౌన్ ప్రభావం అన్ని ఇండస్ట్రీలతో పాటు సినిమా ఇండస్ట్రీపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ కార్మికులు ప్రస్తుతం నానా సమస్యలకు గురవుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి ఆధ్వర్యంలో సిసిసి సంస్థను ఏర్పాటు చేసి ఈ సమయంలో ఇబ్బందులకు గురవుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. సిసిసి కోసం పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఈ ఛారిటీ కోసం 75 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో సినీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అయితే హీరోలు మాత్రమే విరాళాలు ఇస్తున్నారు. భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకునే హీరోయిన్లు మాత్రం ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించ లేదు. హీరోయిన్లకు సినీ కార్మికుల విషయంలో బాధ్యత లేదా? అంటూ బ్రహ్మాజీ ప్రశ్నించారు. అయితే టాలీవుడ్ హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి మాత్రమే ఇప్పటి వరకు విరాళాన్ని అందించారు.













