హోల్డ్ లో బ్రహ్మ రాక్షస
ఈ ఏడాది హనుమాన్ రూపంలో ఇండస్ట్రీకి అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఫోటో షూట్, గ్లింప్స్ తీసి వాటి ద్వారా మీడియాకు అధికారికంగా ప్రకటిద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా హోల్డ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది.
క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాను హోల్డ్ లో పెట్టారని ముంబై మీడియాలో వార్తలొస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని డైరెక్టర్ సన్నిహితులంటున్నారు. హనుమాన్ చూసిన రణ్వీర్ ఆ సినిమాకు ఫిదా అయి ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడు. రణ్వీర్ కు సరిపోయే కథ ప్రశాంత్ దగ్గర ఉండటంతో సినిమా వెంటనే సెట్స్ పైకి వెళ్లింది.
బ్రహ్మరాక్షస అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడేమో ఈ వార్తలు ఆడియన్స్ ను నిరాశకు గురిచేస్తున్నాయి. బ్రహ్మ రాక్షసను సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కాకుండా విడిగా తీయమని రణ్వీర్ ప్రశాంత్ ను కోరాడట. దానికి ప్రశాంత్ ఒప్పుకోలేదని అందుకే ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయని కొందరంటున్నారు. ఒకవేళ ఇదంతా నిజమైతే మాత్రం జై హనుమాన్ కు సంబంధించిన పనులు ఊపందుకునే ఛాన్సుంది.













