గగ్గోలు పెడుతున్న కన్నడిగులు : ఆర్ఆర్ఆర్ మా మాతృబాష లో విడుదల చేయకపోవడం మాకు అవమానమే!
ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న ఆర్ఆర్ఆర్ టీం ఇండియన్ అన్ని భాషల ఆడియన్స్ దృష్టిని లాగేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ చేపట్టిన ఆర్ఆర్ఆర్ టీమ్ పలు ఇంటర్వూస్ అటెండ్ కావడంతో పాటు దేశంలోని రాష్ట్రాలన్నింటినీ చుట్టి వస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొన్నప్పటికీ.. కన్నడిగులు మాత్రం నిరసన సెగ రేపుతున్నారు. ఈ పరిస్థితుల నడుమ కర్ణాటక రాష్ట్రంలో మాత్రం నిరసన సెగ రావడం హాట్ టాపిక్ అయింది. BoycottRRRinKarnataka అనే హ్యాష్ ట్యాగ్‌తో విరుచుకుపడుతున్నారు. ఇటీవలే కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు రాజమౌళి. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విచ్చేసి ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు గుప్పించారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో కన్నడిగుల ఈ కోపానికి కారణం ఏంటంటారా? ఆర్ఆర్ఆర్ మూవీ కన్నడ భాషలో పెద్ద ఎత్తున రిలీజ్ కాకపోవడమే ఈ ఆగ్రహానికి బీజం వేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ భారీగా రిలీజ్ అవుతుంది మరి కన్నడ వర్షన్ మాటేమిటి? అంటూ మండిపడుతున్నారు కన్నడిగులు. ఇతర భాషలతో పోల్చితే తమ మాతృభాష అయిన కన్నడ వర్షన్ రిలీజ్ తక్కువ చేయడం మాకు అవమానమే అంటూ నిరసన వ్యక్తం చేస్తూ రాజమౌళికి ట్యాగ్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాను దాదాపు 60 దేశాల్లో విడుదల చేస్తుండటం విశేషం. మరి కర్ణాటక రాష్ట్రము ఏం పాపం చేసుకుందని ప్లాన్ చేయలేదోమరి?













