బోయపాటి ముందు ఎవరితో?
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప2 తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొన్నాళ్లుగా పుష్ప2 తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై ఎన్నో రకాల వార్తలొస్తున్నాయి.
కొందరు అట్లీతో మూవీ కన్ఫర్మ్ అయిందంటుంటే, మరికొందరు త్రివిక్రమ్ తోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని, ఇంకొందరు బోయపాటితో ఉంటుందని అన్నారు. కానీ బన్నీ మాత్రం తన నెక్ట్స్ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను రీసెంట్ గా బన్నీని కలిసి ఓ కథ చెప్పినట్లు తెలుస్తోంది.
బన్నీ కూడా ఈ కథకు ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సరైనోడు సినిమా వచ్చి అప్పట్లో ఆ సినిమా బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా స్కంద తో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న బోయపాటి, ఈ సారి బన్నీ స్క్రిప్ట్ విషయంలో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నాడట.
అయితే బోయపాటి, బాలయ్యతో కూడా ఓ సినిమాను ఓకే చేయించుకున్న విషయం తెలిసిందే. ఏపీ ఎలక్షన్స్ కంటే ముందే వీరి కాంబోలో ఒక సినిమాను తీసి రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ అది కుదరలేదు. దీంతో ఎలక్షన్ అయ్యాక అఖండ2 ను చేద్దామని బాలయ్య-బోయపాటి ఫిక్స్ అయినట్లు వార్తలొచ్చాయి. మొత్తానికి ఇప్పుడు బోయపాటి చేతిలో రెండు ఆఫర్లున్నాయి. ఈ రెండింటిలో బోయపాటి ఏ సినిమాను ముందు మొదులపెడతాడో చూడాలి.













