రామ్-బోయపాటి సినిమా వచ్చేది ఎప్పుడంటే?
రామ్ పోతినేని గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుని తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తన సినిమాలతో లక్షలాది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు రామ్.
ఇక అసలు విషయానికి వస్తే, రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లో రామ్ చేస్తున్న రెండో మూవీ ఇది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా జులైలో రిలీజ్ చేస్తారని టాక్ వస్తుంది.
ఇప్పట్లో అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడట. రామ్ కూడా ఈ మూవీలో పక్కా మాస్ అవతారంలో కనిపించనున్నాడని టాక్.
ఈ మూవీని పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలయ్యాయని టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రామ్ రెండు పాత్రలు పోషించనున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.













