బోయపాటి ఇకనైనా తెలుసుకోవాల్సిందే
మాస్ సినిమాలు తీయడంలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను తన లోపాలేంటో తెలుసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. బోయపాటి నుంచి వచ్చిన మొదటి రెండ సినిమాలు తప్పించి తర్వాత చేసిన సినిమాలన్నీ ఓవర్ మాస్, లౌడ్ హీరోయిజం వైపు టర్న్ తీసుకున్నవే.
బాలయ్యతో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయంటే వాటిలో బాలయ్య స్టామినా ఎంతుందో గుర్తు పెట్టుకోవాలి. బాలయ్య కాకుండా బోయపాటి ఆ సినిమాలు వేరే ఏ స్టార్ హీరోతో చేసినా ఆ సినిమాలు ఇంతలా హిట్ అవ్వవనేది వాస్తవం. అయితే రీసెంట్గా వచ్చిన స్కంద సినిమాలో బోయపాటి మరీ టూ మచ్ సీన్స్ ను పెట్టారు.
ఓ సాధారణ యువకుడు హెలికాప్టర్ తీసుకొచ్చి సీఎం కూతుర్ని తీసుకెళ్తుంటే కమాండోలు సైతం తమాషా చూడటం లాంటి ఎన్నో సీన్స్ స్కందలో ఉన్నాయి. ఇలాంటి వాటిని బోయపాటి ఇకపై రిపీట్ చేయకుండా ఉంటే తన కెరీర్‌కే మంచిది. అఖండ2 ఎప్పుడుంటుందో తెలియదు. ఈ లోపు బోయపాటితో సూర్య సినిమాకు సైన్ చేశాడని టాక్ నడుస్తుంది. ఇదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
కానీ ఒక్కటి మాత్రం నిజం. బోయపాటి, బాలయ్యను డీల్ చేసినట్లు అందర్నీ డీల్ చేయలేడనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ స్కంద కు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే సెకండ్ పార్ట్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇప్పుడే డెసిషన్ తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చేసరికి స్కంద2 ఉంటుందా లేదా అన్నది డౌట్‌గా మారింది.













