ఆ ఇద్దరు కలిసి ముచ్చటగా మూడో సినిమా
బాలకృష్ణ- బోయపాటి శ్రీను కలయికలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి, అంచనాలు ఏర్పడుతుంటాయి. ఆ కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో, అంతకుమించి అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి. ఆ ఇద్దరు కలిసి ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారు. డిసెంబరు నుంచి ఆ చిత్రం మొదలు కాబోతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయబోతున్నారట. ఒక పాత్ర కోసం ఆయన 25 కిలోల బరువు తగ్గబోతున్నారు. అందుకోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. రోజుకి 5 గంటల చొప్పున జిమ్‌లో చెమటోడుస్తున్నారు. వైట్ రైస్‌కి దూరంగా ఉంటూ ఆహార నియమాలు పాటిస్తున్నారట. ఇప్పటికే ఆయన 15 కిలోల బరువు తగ్గినట్టు సమచారం.













