Akhanda2: అఖండ2 కోసం బోయపాటి మాస్టర్ ప్లాన్
ఒకదాన్ని మించి మరొకటి వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు అందుకుని హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న బాలయ్య(Balayya)- బోయపాటి(Boyapati) ద్వయం ఇప్పుడు అఖండ2(Akhanda2) కోసం రంగం చేసుకుంది. ఈ సినిమా కోసం బోయపాటి చాలా పెద్ద ప్లానే వేసినట్టున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా యూనిట్ మహా కుంభమేళాకు వెళ్లి అక్కడ కోట్లాది మధ్య షూటింగ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో అఘోరాల విన్యాసాలు, దేవతల ఊరేగింపులు, భక్తుల ఆనందాలు చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. అలాంటి చోట షూటింగ్ అంటే మామూలు విషయం కాదు. సినిమాలోని ఓ కీలక ఘట్టానికి సంబంధించిన ఫుటేజ్ కోసం అక్కడ కొన్ని సీన్స్ షూట్ చేశారని, మరోసారి చిత్ర యూనిట్ కుంభమేళా దగ్గరకు వెళ్లి షూటింగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
దుష్ట శక్తులను అంతమొందిచడానికి అఘోరా బాలయ్య అపారమైన దివ్య శక్తులను పోగు చేసే క్రమంలో చాలా ముఖ్యమైన ఎపిసోడ్ ఈ నేపథ్యంలో ఉంటుందని, ఆ సీన్స్ స్క్రీన్ పై చూసినప్పుడు గూస్బంప్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ చెప్తోంది. సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న అఖండ2 షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా జరుగుతుంది.













