బోయపాటి మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా?
అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను, రామ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్కంద అనే టైటిల్ను లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. హీరో ఎవరైనా సరే వారికి క్యారెక్టర్ కు మాస్ టచ్ ఇచ్చి, వారికి మంచి మాస్ ఇమేజ్ తీసుకురావడంలో బోయపాటి చాలా ఎక్స్పర్ట్. స్కంద విషయంలో రామ్ కు కూడా మంచి ఊర మాస్ ఇమేజ్ వచ్చేలా బోయపాటి బాగానే ట్రై చేస్తున్నట్లు రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థమవుతుంది.
అయితే బోయపాటి చేసిన సినిమాల టీజర్లు, ట్రైలర్లు చూసి సినిమాలను అంచనా వేయడం కష్టమే. ఎందుకంటే గతంలో ఆయన నుంచి వచ్చిన సినిమాల టీజర్లు, ట్రైలర్లు విపరీతంగా ఆకట్టుకున్నా సినిమాలు మాత్రం ఫెయిలైన దాఖలాలున్నాయి. ఎన్టీఆర్ తో చేసిన దమ్ము, రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమాల రిజల్ట్ లు తెలిసినవే.
అందుకే బోయపాటి సినిమాల టీజర్లు చూసి సినిమాను అంచనా వేయడం కరెక్ట్ కాదు. కాబట్టి స్కంద రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం కానీ బోయపాటి ఈ సినిమాను కూడా అఖండ తరహాలోనే తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అదే కానీ నిజమైతే మరోసారి బోయపాటి మ్యాజిక్ వర్కవుట్ అయ్యి, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువే ఉంది. ఈ సినిమా విషయంలో బోయపాటి, రామ్ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి రామ్ తో బోయపాటి చేస్తున్న స్కంద సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. స్కంద సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













