స్కంద విషయంలో బోయపాటి ప్లానింగ్ సూపర్బ్
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ కూడా చాలా పెద్దమొత్తంలోనే జరిగింది. ఇప్పటివరకు తన కెరీర్లోనే హయ్యెస్ట్ డీల్స్ స్కంద సినిమాకు వచ్చాయంటే సినిమా పై ఏ రేంజ్ అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో బోయపాటి స్టైల్ మాస్ ఎలిమెంట్స్ తో స్కంద ఉండబోతుందని ప్రేక్షకులకు టీజర్‌తోనే అర్థమైపోయింది. పైగా ఈ మధ్య మాస్ సినిమాలకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
సినిమా స్టోరీ ఎలా ఉన్నా సరే మంచి యాక్షన్ సీన్స్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్కంద ఆఖరి 30 నిమిషాలు గూస్ బంప్స్ ఇస్తుందని, సినిమాలో చాలా ఎలిమెంట్స్ బాగా హై ఇస్తాయని ఇప్పటికే పాజిటివ్ రిపోర్ట్స్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్నాయి. అంతేకాదు ఒకవేళ స్కంద హిట్ అయితే దానికి సీక్వెల్ గా స్కంద2 కోసం ఓ అదిరిపోయే లీడ్‌ను కూడా బోయపాటి సెట్ చేశాడని తెలుస్తోంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న స్కంద ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













