NBK110 బోయపాటితోనే!
బాలకృష్ణ కు మంచి మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్లలో ఆనాటి వాళ్ళలో కోడి రామకృష్ణ, బి. గోపాల్ పేర్లుంటే ఇప్పటి డైరెక్టర్లలో బోయపాటి శ్రీను పేరు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే బాలయ్య-బోయపాటి కాంబోలో మూడు సినిమాలు తెరకెక్కగా, ఆ మూడు సినిమాలూ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. సింహా అంచనాలకు మించి ఆడితే, లెజెంట్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక అఖండ, కరోనా కష్టకాలాన్ని తట్టుకుని, మరీ రికార్డులను కొట్టింది. బాలయ్యను బోయపాటి చూపించినంత పవర్ఫుల్గా మరే డైరెక్టర్ చూపించలేడనేది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవం. అఖండ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా ఉంటుందని అప్పుడే చెప్పారు. అది త్వరలోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో NBK110 కు ఇప్పటికే ఒప్పందం జరిగిందని ఇన్సైడ్ టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ సినిమా తర్వాత ఏపీ ఎన్నికల పనుల్లో బిజీ అయిపోతారు. ఎలక్షన్స్ తర్వాత బోయపాటితో కలిసి బాలయ్య సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. మరి బాలయ్యతో బోయపాటి చేసేది కొత్త స్టోరీనా లేక అఖండ-2నా అన్నది తెలియాల్సి ఉంది.













