బాక్సింగ్ స్పెషల్ ఎపిసోడ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇండియాలో పేరొందిన బాక్సర్ నీరజ్ గోయత్ రామ్‌చరణ్‌ను స్పెషల్‌గా ట్రైన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాక్సింగ్‌కి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ ఉంటుందట. రామ్‌చరణ్‌తో సెట్స్‌లో ఉన్న ఫోటోను ఇటీవల షేర్ చేశారు నీరజ్ గోయత్. ‘‘రామ్‌చరణ్‌తో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఫీల్‌నిచ్చింది’’ అంటూ ట్వీట్ చేశారు నీరజ్.













