వెంకీ, నాగ్ ఫ్యాన్స్ వార్
దగ్గుబాటి వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సైంధవ్. ఈ సినిమా వెంకీ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇక ది ఘోస్ట్ సినిమా తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని అక్కినేని నాగార్జున, కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా నా సామి రంగ. ఈ రెండు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్న విషయం తెలిసిందే.
ఎప్పుడైతే సైంధవ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని తెలిసిందో వెంటనే నాగ్ ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు. నా సామి రంగ రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ పండగకు రిలీజ్ అని అనౌన్స్ చేశారు. దాని ప్రకారమే షూటింగ్ కూడా శరవేగంగా కానిచ్చేస్తున్నారు. కాకపోతే ఇది రీమేక్ సినిమా కాబట్టి రిస్క్ ఎక్కువ అని రిలీజ్ దగ్గర పడేనాటికి వాయిదా ఏమైనా వేస్తారేమో చూడాలి.
అయితే ఇప్పుడు ఈ సీనియర్ హీరో ఫ్యాన్స్ ఇద్దరూ నెట్టింట గొడవలకు దిగుతున్నారు. మా హీరో సినిమా గొప్పంటే మా హీరో సినిమా గొప్పంటూ తొడలు కొట్టుకుంటున్నారు. నిజానికి వీరిద్దరి మధ్య క్లాష్ చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. వాటిలో 1992లో చంటి, కిల్లర్ రిలజైన సందర్భం ఒకటి. ఇందులో చంటి సూపర్ హిట్ అవగా, కిల్లర్ హిట్ గా మిగిలింది.
ఆ తర్వాత 1996లో వారం గ్యాప్ తో ధర్మ చక్రం, వజ్రం రిలీజయ్యాయి. అప్పుడు కూడా వెంకీనే గెలిచాడు. తర్వాత నిన్నే పెళ్లాడతా, పవిత్ర బంధం రిలీజై మంచి హిట్లు అందుకున్నాయి. అయితే మరోసారి ఇప్పుడు వీరిద్దరి సినిమాలు క్లాష్ అవుతుండటంతో ఇద్దరి ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తూ గొడవకు దిగుతున్నారు. బాలయ్య, చిరూ సినిమాలకు ఇలాంటి ఫ్యాన్ వార్స్ జరగడం కామన్ కానీ ఈసారి విచిత్రంగా వెంకీ, నాగ్ సినిమాలకు ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి.













