న్యూ ఇయర్ రోజున కలెక్షన్లతో షేక్ అయిన థియేటర్లు…
హాలిడే సీజన్ సినిమాలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మరోసారి రుజువైంది. 2023 టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి స్టార్ట్ అప్ నే ఇచ్చిందని చెప్పాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ లభిస్తుందని, కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉంటాయని జనవరి ఫస్ట్ మరోసారి నిరూపించింది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, రివ్యూ లతో సంబంధం లేకుండా కూడా సినిమాలను ఆడియన్స్ చూస్తారని న్యూ ఇయర్ రోజున రిలీజైన సినిమాల కలెక్షన్లు చూస్తేనే ఆర్డమవుతుంది.
2023 జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ కావడం, అలాగే వీకెండ్ కూడా కావడంతో ఈ హాలిడేని అన్ని సినిమాలు కూడా బాగా వినియోగించుకొన్నాయి. ముఖ్యంగా ఈ రోజు రిలీజైన “ధమాకా” సినిమా అయితే ఊహించని స్థాయిలో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు మొదటిరోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో అలాగే 10వ రోజు కూడా ఈ సినిమాకు అంతే వసూళ్లు వచ్చాయి.
మరొక సినిమా అవతార్ 2 ఇప్పటికే మంచి ప్రాఫిట్ లో కొనసాగుతోంది. ఒక్క ఆదివారం రోజు ఈ సినిమా నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక 18 పేజెస్ సినిమాకు 1.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు ఎక్కువగా వీకెండ్ లోనే మంచి కలెక్షన్లు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఖుషి” 4K శనివారం రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు న్యూ ఇయర్ రోజున ఏపి తెలంగాణలో 1.52 కోట్లు రావడం విశేషం. ఖుషి సినిమాకు మొదటి రోజు అలాగే రెండవ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.













