కళ్యాణ్ రామ్ సినిమాలో ఆ రెండూ హైలైట్స్ గా నిలవనున్నాయట..
ఎంత మంచి వాడవురా సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో మంచి సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో సినిమా చేస్తున్నాడు. రాజేంద్ర అనే కొత్త డైరక్టర్ ను పరిచయం చేస్తూ, కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ లో ఒక సినిమా రానుంది.
మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకుని, సినిమాలను నిర్మించే మైత్రీ బ్యానర్, కల్యాణ్ రామ్ కు కూడా మంచి సక్సెస్ ఇస్తుందని నందమూరి ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో ఉన్న రెండు అంశాలు సినిమాను ఖచ్చితంగా సక్సెస్ చేస్తాయనే నమ్మకంతో సినిమా యూనిట్ అంతా ఉంది. ఇంటర్వెల్ టైమ్ లో కళ్యాణ్ రామ్ రెండ్ క్యారెక్టర్ స్టోరీని ట్విస్ట్ చేసే విధంగా ఉండటం ఆడియన్స్ కు ఆసక్తి రేకెత్తించేలా ఉంటుందట.
ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండనుందని, ఈ రెండు అంశాలు సినిమాకు చాలా పెద్ద ప్లస్ కానున్నాయని ప్రేక్షకులు చెప్తున్నారు. ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా ఆడియన్స్ కు కూడా ఇవి నచ్చేలా ఉండనున్నాయనే నమ్మకం ను మైత్రీ బ్యానర్ వారు వ్యక్తపరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను వెల్లడించే ఛాన్స్ ఉందని, ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.













