రాజమండ్రిని హైలైట్ చేస్తున్న గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. దీని కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమాకీ, రాజమండ్రికీ ఏదో గట్టి సంబంధమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా భాగం వరకు చేశారు.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలోనే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ మరికొన్ని సీన్స్ కూడా అక్కడే షూట్ చేశారు. ఇప్పుడు తాజాగా రాజమండ్రి షెడ్యూల్ తోనే షూటింగ్ ను పూర్తి చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఈ వారం నుంచి రాజమండ్రి లోనే మొదలుకానుందని సమాచారం.
ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే లాస్ట్ షెడ్యూలా లేక ఇంకా షెడ్యూల్స్ ఉన్నాయా అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తేనే తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ కోసం ఎన్నో చోట్ల స్పెషల్ గా సెట్స్ వేశారు. కానీ రాజమండ్రి ఫేమస్ అయినంతగా మరో స్పాట్ ఫేమస్ కాలేదు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ, ఆర్ఎఫ్సి, అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో జరిగినప్పటికీ గేమ్ ఛేంజర్ విషయంలో రాజమండ్రి ఫేమస్ అయినంతగా మరో స్పాట్ ఫేమస్ కాలేదనేది మాత్రం వాస్తవం.













