బొంబాట్ ఫస్ట్‌లుక్ విడుదల
ఈ నగరానికి ఏమైంది ఫేమ్ సుశాంత్, సిమ్రాన్, చాందినిలు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం బొంబాట్. కే.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్ హన్నూర్కర్ నిర్మించారు. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాఘవేంద్రవర్మ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సందర్భంగా పూరి మాట్లాడుతూ యంగ్ బ్లడ్ కలిసి చేసిన బొంబాట్ ఫస్ట్ లుక్ బావుంది. ఈ చిత్ర సంగీత సారథి జోష్.బి నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా విజయం సాధించి కలెక్షన్స్‌లో బొంబాట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.













