Hansika: బాంబే హైకోర్టులో హన్సికకు చుక్కెదురు

హీరోయిన్ హన్సిక(hansika)కు ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. గృహ హింస కేసుకు సంబంధించి ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ(prasanth mothwani), టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్(muskan nansi james) ను 2021లో పెళ్లి చేసుకోగా, పెళ్లి దగ్గర్నుంచే వారి లైఫ్ లో ఒడిదుడుకులు మొదలయ్యాయి. పెళ్లైన సంవత్సరం తర్వాత నుంచే ఇద్దరూ విడివిడిగా ఉండటం స్టార్ట్ చేశారు.
అయితే గతేడాది డిసెంబర్ లో నాన్సీ, హన్సిక మరియు హన్సిక తల్లిపై గృహ హింస చట్టం కింద వివిధ సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. నాన్సీ పెట్టిన ఎఫ్ఐఆర్ లో 498ఎ, 323, 352 సెక్షన్లుండగా, ప్రశాంత్ తో పెళ్లి జరిగాక హన్సిక మరియు అతని తల్లి జ్యోతి(Jyothi) అనవసరంగా జోక్యం చేసుకోవడంతోనే తమ మధ్య విభేదాలొచ్చాయని నాన్సీ కంప్లైంట్ చేశారు.
వారిపై కేసు నమోదు చేయడంతో పాటూ వారి నుంచి భారీ డబ్బును డిమాండ్ చేశారు నాన్సీ. ఈ కేసులో ఫిబ్రవరిలో హన్సిక, జ్యోతి కి ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయగా, ఏప్రిల్ లో వారు ఎఫ్ఐఆర్ ను క్యాన్సిల్ చేయాలని బాంబే హై కోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు చూసి షాకయ్యానని నటి హన్సిక ఎఫ్ఐఆర్ లో చెప్పగా, హన్సిక పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చి ఆమెపై విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.