Adhipurush: ఆదిపురుష్ పై బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Krithi Sanon) హీరోయిన్ గా ఓం రౌత్(Om raut) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్(Adhipurush). భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచింది. ఫ్లాపుగా నిలవడమే కాకుండా ఆ సినిమాపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఆదిపురుష్ గురించి బాలీవుడ్ డైరెక్టర్ అశ్విన్(Ashwin) మాట్లాడారు.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహావతార్: నరసింహ(Mahavathar: Narasimha) జులై25న రిలీజ్ కానుండగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఆయన ఆదిపురుష్ గురించి మాట్లాడారు. ఆదిపురుష్ వైఫల్యానికి చాలా కారణాలున్నాయని, వాటి గురించి తాను మాట్లాడదలచుకోలేదని, కానీ ఆదిపురుష్ తో మేకర్స్ ఏం చెప్పాలనుకున్నారనేది మాత్రం తనకు అర్థమైందన్నారు.
రామాయణం కథతో ఎన్ని సినిమాలొచ్చినా ఆడియన్స్ వాటిని ఇంట్రెస్ట్ గానే చూస్తారని, బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణ(Ramayana) ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తుందని ఆయన అన్నారు. సినిమాకు బడ్జెట్ మాత్రమే ముఖ్యం కాదని, కథను ఎలా చూపిస్తామనేదే కీలకమని చెప్పిన ఆయన పురాణ కథలతో తీసే సినిమాలకు త్వరలోనే మంచి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు.