Bobby: యంగ్ హీరో వేటలో బాబీ
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) సాలిడ్ లైనప్ తో ఏడు పదుల వయసులో కూడా దూసుకెళ్తున్నారు. ఓ వైపు విశ్వంభర(Viswambhara) సినిమాను పూర్తి చేసిన చిరూ, మరోవైపు అనిల్ రావిపూడి(anil ravipudi)తో కలిసి మన శంకరవరప్రసాద్ గారు(Mana shankaravaraprasad garu) ను సంక్రాంతిని రెడీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి బాబీ కొల్లి(bobby kolli) దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మెగా158(mega158)గా తెరకెక్కనున్న ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చిరూ, బాబీ కలయికలో వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ- చిరూ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా కావడంతో మెగా158పై మంచి అంచనాలున్నాయి.
అయితే ఈ సినిమాను బాబీ ఓ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న బాబీ ఈ ఇయర్ ఎండింగ్ కు సినిమాను మొదలుపెట్టే ఛాన్సులున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఓ యంగ్ హీరో నటించనున్నాడని, వాల్తేరు వీరయ్యలో రవితేజ(Ravi teja) పాత్రలాగే ఈ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండనుందని అంటున్నారు. ఆ క్యారెక్టర్ కోసం ఓ యంగ్ హీరోను వెతికే పనిలో బాబీ బిజీగా ఉన్నాడట. కాకపోతే ఆ యాక్టర్ ను తెలుగు నుంచి తీసుకుంటారా లేదా వేరే భాష నుంచి తీసుకుంటారా అనేది చూడాలి.







