Bobby Deol: బాబీ డియోల్ ఆ పేరు వింటేనే ఎమోషనల్ అవుతాడట
తన తండ్రి ఒకప్పుడు సూపర్ స్టార్, అన్న మినిమమ్ గ్యారెంటీ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే బాబీ డియోల్(Bobby Deol) ఒకప్పుడు హీరోగా చేసినా ఆ తర్వాత కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా చేయలేని సిట్యుయేషన్స్ వచ్చాయి. పదేళ్ల పాటూ ఆయన తన భార్య డబ్బులతోనే జీవితాన్ని నెట్టుకొచ్చాడు. చివరకు కొడుకు కూడా నాన్న ఇక ఏం చేయడా అనే ప్రశ్న విని బాబీ డియోల్ ఎంతో నరకాన్ని అనుభవించాడు.
అలాంటి బాబీ డియోల్ ఇప్పుడు అసలు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. యానిమల్(Animal) సినిమా తర్వాత బాబీ ఫేట్ పూర్తిగా మారిపోయింది. 15 ఏళ్లుగా ఇంట్లోనే ఉన్న బాబీ జీవితాన్ని యానిమల్ సినిమా మార్చేసింది. అందుకే ఇప్పుడు అతను ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడని డాకు మహారాజ్(Daku Maharaj) డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) వెల్లడించాడు.
తన జీవితాన్న మార్చేసిన బాబీ డియోల్ పేరు ఎత్తితేనే బాబీ డియోల్ చాలా ఎమోషనల్ అయిపోతాడని, ఒకప్పుడు బాలీవుడ్ లో మంచి సినిమాలు చేసిన బాబీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం ఎన్నో స్టూడియోలకు తిరిగాడని, ఫోటోలు పంపితే చూసి బావున్నాయనే వారే కానీ ఎవరూ ఛాన్సులివ్వలేదని, కానీ ఓ తెలుగోడైన సందీప్ రెడ్డి వంగా తన జీవితాన్నే మార్చేశాడని బాబీ డియోల్ ఎంతో గర్వంగా చెప్పుకుంటాడని బాబీ కొల్లి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.













