బాలయ్య109 కోసం బాలీవుడ్ విలన్
ప్రస్తుతం టాలీవుడ్ లో బాలకృష్ణ ఎరా నడుస్తోంది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. భగవంత్ కేసరి సక్సెస్ ఇచ్చిన బూస్ట్ తోనే తన తర్వాతి సినిమాను బాబీ దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ బాబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడట నిర్మాత నాగవంశీ. ఈ నేపథ్యంలో సినిమాలోని నటీనటుల విషయంలో బాబీ చాలానే ఖర్చు పెడుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి బాబీ ట్రై చేస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కోసం బాబీ ప్రయత్నిస్తున్నాడట. యానిమల్ తర్వాత బాబీ డియోల్ మరో సౌత్ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడని, అది బాలయ్య సినిమా కోసమే అని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం. బాబీ ఇంతలా హైప్ పెంచేస్తున్న ఈ సినిమా బాలయ్యకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.













