Spirit: స్పెషల్ రోల్ లో బాబీ డియోల్?
అర్జున్ రెడ్డి(Arjun Reddy), యానిమల్(Animal) సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ఆయన తన తర్వాతి సినిమాను ప్రభాస్(Prabhas) తో చేయనున్న విషయం తెలిసిందే. యానిమల్ ను మించి స్పిరిట్(Spirit) సినిమాను తీయాలని సందీప్ ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు కథ, స్క్రిప్ట్, డైలాగ్ వెర్షన్ తో బిజీగా ఉన్న సందీప్ ఇప్పుడు నటీనటుల ఎంపికపై చర్చలు జరుపుతున్నాడట.
సినిమాలో ప్రభాస్ కాంకుడా ఒక పదికి పైగా కీలక పాత్రలున్నాయట. ప్రస్తుతం ఆ పాత్రల కోసం నటులను వెతికే పనిలో సందీప్ బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం సందీప్ తన యానిమల్ లో విలన్ గా నటించిన బాబీ డియోల్(Bobby Deol) ను స్పిరిట్ సినిమాలో నటింపచేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.
కెరీర్ పూర్తిగా డ్యామేజ్ అయి, ఇంకేం లేదనుకున్న టైమ్ లో బాబీ డియోల్ కు సందీప్ రెడ్డి యానిమల్ ద్వారా పూర్వ వైభవం వచ్చేలా చేశాడు. కాబట్టి సందీప్ అడిగితే బాబీ ఎంత బిజీగా ఉన్నా ఒప్పుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్పిరిట్ లో బాబీ డియోల్ విలన్ పాత్రలో కాకుండా ఆయన కోసం సందీప్ ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశాడని తెలుస్తోంది.













