ఎన్టీఆర్- నీల్ సినిమాకు విలన్ గా బాలీవుడ్ నటుడు?
సౌత్ సినిమాల్లో విలన్ పాత్రల కోసం ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ ను తీసుకుంటున్న విషయం తెలిసిందే. మన హీరోలందరూ పాన్ ఇండియా స్టార్ లో సినిమాలు చేస్తుండటంతో బాలీవుడ్ నటులు కూడా తమ ఇమేజ్ ను పెంచుకోవాలనుకునే నేపథ్యంలో సౌత్ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెమ్యూనరేషన్ కూడా భారీగా వస్తుండటంతో ఏ మాత్రం ఆలోచించకుండా బాలీవుడ్ స్టార్స్ సినమిఆలు చేసేస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం ప్రశాంత్ నీల్ బాబీ డియోల్ ను సంప్రదిస్తున్నాడట.
ప్రస్తుతం టీమ్ ఈ విషయమై టీమ్ చర్చలు జరుపుతుందట. రెమ్యూనరేషన్ గురించి ఓ కొలిక్కి వస్తే ఆయన ఫైనల్ అయినట్లే అని తెలుస్తోంది. ఈ సినిమా కు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. బాబీ డియోల్ కూడా విలన్ గా నటిస్తే ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే ఛాన్సుంది. ప్రస్తుతం దేవరను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ సినిమా అయ్యాక ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు.













