చరణ్ సినిమాకు విలన్ ఫిక్స్?
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే చరణ్ బుచ్చి బాబు సానతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ లో భాగంగా బుచ్చిబాబు నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలకమైన విలన్ రోల్ కు బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ను తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్ తో పాటూ అన్ని భాషల ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన బాబీ డియోల్ కు ఇప్పుడు వరుసగా ఆఫర్లొస్తున్నాయి.
ఇప్పటికే ఓ టాలీవుడ్ సినిమాకు కమిట్ అయిన బాబీ డియోల్ ఇప్పుడు చరణ్ సినిమాలో విలన్ గా నటించేందుకు ఒప్పుకున్నాడంటున్నారు. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను సమ్మర్ నుంచి మొదలు పెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరాకు రిలీజ్ చేయాలని బుచ్చి బాబు ప్లాన్.













