Bobby Deol: వీరమల్లులో బాబీ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే..
యానిమల్(Animal) సినిమాతో ఒక్కసారిగా ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. బాబీ పట్టిందల్లా బంగారమే అవుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా దూసుకెళ్తున్న బాబీ డియోల్కి సౌత్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు నాలుగు సౌత్ సినిమాలున్నాయి.
రీసెంట్ గా డాకు మహారాజ్(Daku Maharaj)లో విలన్ గా మెప్పించిన బాబీ డియోల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu)లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో బాబీ పాత్ర ఎలా ఉంటుందనేది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే బాబీ వీరమల్లులో విలన్ పాత్ర చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
పవన్ గెటప్ ను బట్టి చూస్తే వీరమల్లులో బాబీ లుక్ కూడా దాదాపు అలానే ఉండే ఛాన్సుంది. సినిమాలో తన పాత్ర చాలా యూనిక్ గా ఉంటుందని, వీరమల్లు లాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, కథ విని ఫస్ట్ సిట్టింగ్ లోనే సినిమాను ఓకే చేసినట్టు బాబీ తెలిపాడు. బాబీ చేసిన వ్యాఖ్యలు వీరమల్లు సినిమాకి ఉన్న బజ్ ను ఇంకా పెంచుతున్నాయి.













