Bobby – Chiru: డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న బాబీ
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్న చిరంజీవి వాటి తర్వాత మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ రెండింటిలో ఒకటి దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో కాగా రెండోది బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో.
ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల సినిమా అనౌన్స్ అవడంతో ఇప్పుడు బాబీ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ చిరూతో వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా తీసి ఆ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈసారితో చిరూ(chiru)తో చేసే సినిమా కోసం ప్లాన్ ను మార్చాడని సమాచారం. ఈసారి మెగాస్టార్ తో తీసే సినిమాను బాబీ ఎంటర్టైనర్ లాగా కాకుండా కొత్తగా ప్లాన్ చేస్తున్నాడట.
చిరూ ఏజ్ కు తగ్గట్టు యాక్షన్ మరియు ఎలివేషన్లతో దీన్ని ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్న బాబీ మరి ఈసారి చిరంజీవితో కలిసి ఎలాంటి సినిమా చేస్తాడో అని తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఈ కాంబో సినిమాపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.







