కాళోజీ బయోఫిక్ ప్రారంభం
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించనున్న కాళోజీ బయోపిక్ షూటింగ్ రెండో షెడ్యూల్ హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైంది. చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కెమెరా స్విచ్ఆన్ చేసి షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ నవలారచయిత డాక్టర్ ప్రభాకర్ జైనీ ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ జీవితంలో జరిగిన ప్రతీ సన్నివేశాన్ని సినిమాలో స్పృశిస్తున్నట్టు చెప్పారు. జైలు జీవితం, తెంగాణ సాయుధ పోరాటం మిత్రమండలి సమావేశాలు తదితర అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నామన్నారు. కాళోజీ పాత్రను మూలవిరాట్, కాళోజీ భార్య పాత్రలో విజయక్ష్మీ జైనీ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పాత్రలో ఆయన సోదరుడు పీవీ మనోహర్‌రావు నటిస్తున్నారని వివరించారు.













