తెలుగు సినీ ప్రేక్షకుడి అభిరుచి మారింది
ఆదరిస్తున్న సినీ రాజకీయ ‘బయోపిక్‘ చిత్రాలు
మహనీయుల జీవిత చరిత్రలను సినీ మాధ్యమం ద్వారా ప్రజలకి అందచేస్తే ఎప్పుడు ఆదరిస్తారని గత బయోపిక్స్ చిత్రాలు నిరూపించాయి. మన జాతి పీత ‘మహాత్మ గాంధీ’ జీవిత చరిత్ర ఆధారంగా 1982 లో రిచర్డ్ అట్టెంబోరౌ రూపొందించిన ‘గాంధీ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఆదరించారో తెలిసిందే. మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో జీవించి సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆ విధంగా బయోపిక్స్ కు వున్నా సక్సెస్ లు పరిశీలిస్తే ఎక్కువ శాతం విజయం సాధించిన చిత్రాలే వున్నాయి. ఈ ఏడాది టాప్ త్రి హిట్ మూవీస్ లో మహానటి సావిత్రి జీవిత చరిత్ర పై తీసిన ‘మహానటి’ చిత్రం, గతంలో రాంగోపాల్ వర్మ అందించిన ‘రక్త చరిత్ర 1,2, మరియు ‘వంగవీటి’ చిత్రాలు ఎంతగా సక్సెస్ పొందాయో తెలిసిందే. మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ్ చిత్రం యం జి ఆర్ జీవిత చరిత్ర ‘ఇరువురు’ కూడా అక్కడి ప్రజలు ఆదరించారు. తెలుగు, తమిళ్ లో కంటే హిందీ లో మరింత గా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలు చాలా వున్నాయి అగ్ర కుల వర్గ అత్యాచారానికి బలైన పూలన్ దేవి కథతో ‘బాండిట్ క్వీన్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవిత కథ ‘ది ఫర్గాటెన్ హీరో’ మొగల్ చక్రవర్తి కథతో ‘జోదా అక్బర్’ , క్రికెట్ ప్లేయర్స్ సచిన్, ధోని, అథ్లెటిక్ మిల్కా సింగ్, మేరీ కోమ్, అన్నా హజారే కథతో ‘అన్నా’ ఒలంపిక్ 1948 లో జరిగిన హాకీ లో ఇండియా సాధించిన ‘గోల్డ్’ మెడల్ కథ, కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ తో ‘దంగల్’. సంజయ్ దత్ జీవితం లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలతో ‘సంజు’ సిల్క్ స్మిత కథ తో ‘డర్టీ పిక్చర్’ ఇలా ఎన్నో చిత్రాలు సక్సెస్ ఖాతాలో వున్నాయి.
ఇక తాజాగా తెలుగులో నందమూరి తారక రామ రావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, మహానాయకుడు కాగా…బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తో మెగా స్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. నటరాజన్ (గిల్లిరాజా) తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కె సి ఆర్ జీవిత కథతో, కల్వకుంట్ల నాగేశ్వరరావు రాసిన కథతో 2018 శాసన సభ ఎన్నికల సందర్భముగా నవంబర్ 29 న విడుదలైన చిత్రం ‘ఉద్యమ సింహం’. గత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి కథ తో ‘యాత్ర’ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన జీవితంలోని కీలకఘట్టాలతో ‘చంద్రోదయం’ పేరుతో బయోపిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. యన్టీర్ రాజకీయ చరిత్ర లో ఒక పర్వం ‘లక్ష్మిస్ యన్టీర్’ విడుదల చేసి మరో సంచలనానికి రెడీ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. ఇంకా నటుడు రంగనాథ్ జీవిత చరిత్రతో ‘రాజువయ్యా మా రాజువయ్యా’. ఈ చిత్రాలు నిర్మాణ దశలో వున్నాయి. తెలుగు బయోపిక్ చిత్రాలతో పాటు హిందీ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘మణి కర్ణిక’ (ది క్వీన్ అఫ్ ది ఝాన్సీ), గణ తంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 25 న విడుదల కానుంది. ఈ చిత్రం లో ఝాన్సీ లక్ష్మిబాయి గా కంగనా రౌనత్ నటించగా, మన తెలుగు దర్శకుడు రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నారు.













