తమన్ సారథ్యంలో.. అలా అమెరికాపురములో

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అమెరికాలో వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది రెండు నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. వాషింగ్టన్ డి.సి, చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్‍లో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా యూఎస్‍లో అలా అమెరికాపురములో.. పేరుతో అతిపెద్ద మ్యూజికల్స్ కార్నివాల్‍లో పాల్గొననున్నారు. తమన్ బృందంలో శివమణి, నవీన్, ఆండ్రియా జెరిమియా, శ్రీకృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, రోషిని, శాండిల్ల, బోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, ఓషో వెంకట్, సిద్ధాంత్, షదాబ్ రాయిన్ వంటి ప్రతిభావంతులైన ప్రదర్శనకారులు ఉన్నారు. దీనికి ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చాలా మంది స్టార్ హీరయిన్లు, మరియు ఇతర సినీ ప్రముఖులు తమన్‍తో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రష్యన్, బెలారస్ నృత్యకారులు.