బిగ్బాస్8 కంటెస్టెంట్లు వీరే!
బుల్లి తెర రియాలిటీ షోలకు రారాజుగా నిలిచిన బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుని 8వ సీజన్ ను త్వరలోనే మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి బిగ్బాస్8 మొదలుకానుంది. దానికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
అయితే కొత్త సీజన్ మొదలవుతుందనగానే ఆ సీజన్ కంటెస్టెంట్స్ గురించి రకరకాల వార్తలు రావడం సహజమే. ఇప్పుడు బిగ్బాస్8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అని ఓ లిస్ట్ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఈసారి ఎక్కువగా బుల్లితెర, సోషల్ మీడియా సెలబ్రిటీలకే బిగ్బాస్ టీమ్ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైరలవుతున్న లిస్ట్ ప్రకారం రీతూ చౌదరి, యాంకర్ విష్ణు ప్రియ ఈసారి సీజన్8 లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు యాంకర్ సీత, న్యూస్ రీడర్ కళ్యాణి, ఒకప్పటి హీరో ఆదిత్య ఓం, సింగర్ సాకేత్, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, యాక్టర్స్ రవితేజ, పరమేష్, అజయ్, నిఖిల్, ఇంద్రనీల్, తేజశ్విని గౌడ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. దీంతో బిగ్ బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













