ఇక అంతా సిద్ధం ఆగస్ట్ 16 నుంచి.. టీవీల్లో రచ్చ రచ్చే!
దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో ఇప్పటివరకు మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ స్టార్ట్ అయ్యే సమయానికి కరోనా వచ్చి పడింది. దీంతో నాలుగో సీజన్ ఉంటుందా, ఉండదా అనే కన్ఫ్యూజన్ కూడా అందరిలోనూ ఉంది. దీనికి సంబంధించి మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ స్టార్ మా లో అధికారికంగా బిగ్‌బాస్ సీజన్ 4 కమింగ్ సూన్ అనే యాడ్ వచ్చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన మరికొంత సమాచారం మనకు అందుబాటులోకి వచ్చింది. ఎంతో కట్టుదిట్టంగా ఈ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అవన్నీ ఒక కొలిక్కి వచ్చాయి.
ఈ సీజన్ 4కి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున పాల్గొన్న ప్రోమోకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. తాజా సమాచారం మేరకు ఆగస్ట్ 16న బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతోంది. మొదట ఈ షో కోసం 30 మందిని ఎంపిక చేశారు. వారిలో 16 మందిని ఫైనల్ చేసి వారందర్నీ 16 రోజులపాటు క్వారంటైన్లో ఉంచారు. షో మొదలయ్యే ముందు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్ట్ 16న షోలో పాల్గొనే వారి పేర్లను నాగార్జున ప్రకటిస్తారు.
షో లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలోనే కాదు, బిగ్‌బాస్ హౌస్ లోపల కూడా కరోనా నిబంధనలను అనుసరించి అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ షోను 50 రోజులకు కుదించారు. అలాగే ఈ షో ఫార్మాట్, గేమ్‌లు, టాస్క్‌లు మొదలైన వాటిలో కూడా ఎన్నో మార్పులు చేశారు. సామాజిక దూరం పాటిస్తూనే ఈ షోను రన్ చేస్తారు. దీనికి సంబంధించిన పబ్లిసిటీని మా టీవీ మరింత ఉధృతం చేయబోతోంది.













