అనారోగ్యంతో బాధపడుతున్న మరో హీరోయిన్..!?
పునర్నవి భూపాళం షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా అందరికి సుపరిచితమే. “ఉయ్యాలా జంపాల” సినిమాతో బిగ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. రాజ్ తరుణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుందని చెప్పాలి. అచ్చ తెలుగు మాట్లాడుతూ, మన ఇంట్లో అమ్మాయిలా ఉండే పునర్నవికి ఎందుకోగానీ తెలుగు ఇండస్ట్రీలో ఆశించిన విధంగా అవకాశాలైతే రాలేదని చెప్పొచ్చు.
న్యూఇయర్ సందర్భంగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర పోస్ట్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. తాను ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడ్తున్నాని పునర్నవి స్వయంగా తెలిపింది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో గత కొంత కాలంగా పోరాడుతున్నాని ఈ అమ్మడు చెప్పింది. అయితే ఈ కొత్త సంవత్సరంలో నా అనారోగ్యానికి ఫుల్ స్టాప్ పెడతానని కూడా ఆమె గట్టిగానే నిర్ణయించుకున్నారట.
2023 న్యూఇయర్ లో పూర్తి ఆరోగ్యంతో మల్లి నేను ప్రేక్షకుల ముందుకి వస్తాను అని పునర్నవి అన్నారు. చాలా కాలం నుండి తన అనారోగ్యంవల్ల ఎలాంటి ప్రాజెక్ట్స్ ని చేయలేదని చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ఏడాదైనా ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ ని అందుకొని, మళ్ళీ ఈ తెలుగు కథానాయిక ప్రేక్షకుల ముందుకి వస్తుందో లేదో చూడాలి.
పునర్నవి పూర్తి ఆరోగ్యంతో, మునుపటి ఉత్సాహంతో తిరిగి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారట. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కి ఫాన్స్ వెల్లువలా కామెంట్స్ చేస్తుండడం విశేషం. సామాజిక మాధ్యమంలో ఈ హీరోయిన్ క్రేజ్ చూస్తుంటే ముందు ముందు టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందిపుచ్చుకునేలా కనిపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు…













