బిగ్బాస్ సీజన్8 స్పెషల్ అప్డేట్
బిగ్ బాస్ షో ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఇండియాలో ఈ షో ను హిందీ ఆడియన్స్ చాలా కాలంగా ఆదరిస్తున్నారు. తెలుగులో కూడా బిగ్ బాస్ షో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సీజన్ కు రెడీ అయింది. ఒక ఓటీటీ సీజన్ ను కూడా తెలుగు బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. ఓటీటీ సీజన్ తో కలిపి ఇప్పటివరకు నాగార్జున ఆరు సీజన్ లకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
ఇప్పుడు రాబోయే సీజన్ 8కు కూడా నాగార్జునే హోస్ట్. ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్స్ కూడా క్లోజ్ అయ్యాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా దాదాపు పూర్తైంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి కంటెస్టెంట్స్ కు సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సీజన్ 8 కోసం 200 మందిని తీసుకుని అందులో 25 మందిని ఫైనల్ చేసి లిస్ట్ రెడీ చేశారట.
వారిలో నుంచి 20 మందిని మొదటి రోజే హౌస్ లోకి పంపుతారని, తర్వాత మిగిలిన వారిని పంపిస్తారని తెలుస్తోంది. సీజన్ 8 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈసారి సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటూ పలు విభిన్నమైన వ్యక్తులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నట్లు తెలుస్తోంది.













