గేమ్ ఛేంజర్ కు పెద్ద రిలీఫ్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ డిసెంబర్ క్రిస్మస్ రిలీజ్ అని నిర్మాత దిల్ రాజు ఎప్పటికప్పుడు చెప్తున్నాడు కానీ డేట్ విషయంలో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. డిసెంబర్ 20 అని డిస్ట్రిబ్యూటర్లకు అనఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వెళ్లిపోయినా శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.
శంకర్ ఓకే అనగానే టీజర్ ను కట్ చేసి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. అయితే డిసెంబర్ 6న రానున్న పుష్ప2కి, గేమ్ ఛేంజర్ కు మధ్య రెండు వారాలు మాత్రమే గ్యాప్ ఉండనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు పోటీ పరంగా ఓ టెన్షన్ తగ్గింది. నిన్నటి వరకు క్రిస్మస్ రేసులో ఉన్న అమీర్ కాన్ సితారే జమీన్ పర్ ఇప్పుడు పోటీ నుంచి తప్పుకున్నట్లు ముంబై మీడియా వర్గాలంటున్నాయి.
ఇంకా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండటంతో హడావిడిగా ఎందుకు రిలీజ్ చేయడమని ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో చరణ్ సినిమాకు రిలీఫ్ దక్కనుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో యుఫాసా ది లయన్ కింగ్ వల్ల థియేటర్ల సమస్య చాలా వచ్చేలా ఉంది. ఒకవేళ అమీర్ సినిమా కూడా ఉంటే ఆ సమస్య ఎక్కువయ్యేది. ఇప్పుడు అమీర్ సినిమా డ్రాప్ అవడంతో సితారేకు ప్లాన్ చేసుకున్న స్క్రీన్స్ గేమ్ ఛేంజర్ కు వచ్చే వీలుంది. అలా అని బాలీవుడ్ నుంచి ఈ సినిమాకు మరే పోటీ లేదని కాదు. బేబీ జాన్, విదయముయార్చి కూడా క్రిస్మస్ బరిలోనే ఉన్నాయి. ఏదేమైనా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ ఇస్తే అన్నింటికీ బావుంటుంది.













