మనోజ్ హోస్టింగ్ వెనుక పెద్ద ప్లానే ఉందిగా
ఈటీవీ విన్ అనే ఓటీటీ కోసం మంచు మనోజ్ ఉస్తాద్ అనే సెలబ్రిటీ గేమ్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్, ఈ షో తనకు కంబ్యాక్ ఇచ్చేందుకు బాగా హెల్ప్ అవుతుందని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాడు. అందులో భాగంగానే తన షో ఫస్ట్ సిరీస్కు గెస్టులుగా నాని, రవితేజ, అడివి శేష్ లాంటి వారిని తీసుకొచ్చాడు.
ఈ సెలబ్రిటీ గేమ్ షో ను నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా బడ్జెట్ పరంగా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఖర్చు పెడుతుంది. గతంలో తన అక్క మంచు లక్ష్మి లానే ఇప్పుడు మనోజ్ కూడా ఆడియన్స్ కు దగ్గరవడానికి ఇలా చేస్తున్నాడు. మనోజ్ ఈ గేమ్ షో చేయడం వెనుక పెద్ద ప్లానింగే ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో రెండు సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న మనోజ్ ఆ సినిమాల ఓపెనింగ్స్ కు చాలా కష్టపడాల్సి ఉంది. గ్రౌండ్ లెవెల్లో మనోజ్ మీద ఆడియన్స్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ అది కలెక్షన్స్ గా మారాలంటే మనోజ్ ఆడియన్స్ కు దగ్గరవాలి. దానికి ఇదే కరెక్ట్ ఆప్షన్ అనుకున్నాడు మనోజ్. వీటన్నింటినీ ఆలోచించే మనోజ్ ఈ షో కు హోస్ట్ గా మారాడని తెలుస్తోంది.













