చరణ్ కోసం బుచ్చిబాబు ఎవరిని తెస్తాడో?
మరో రెండు నెలల్లో గేమ్ ఛేంజర్ సినిమా పూర్తవనుండటంతో రామ్ చరణ్ చేయనున్న తర్వాతి సినిమా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సపోర్టింగ్ క్యాస్ట్ ని ఎంచుకునే పనిలో ఉన్న టీమ్, హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఇంకా ఆలోచిస్తూనే ఉందట. ముందు అలియా భట్‌ను అడిగారని టాక్ వచ్చింది.
కానీ ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తెలుగు సినిమాల్లో నటించే సిట్యుయేషన్స్ లో లేదు. రీసెంట్ గా సమంతను అన్నారు కానీ అదీ కూడా రూమరే అని తేలింది. అయితే ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పక్కా పల్లెటూరి నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమా కోసం చరణ్ కు ఆ స్లాంగ్ నేర్పించడానికి స్పెషల్ ట్రైనింగ్ ను రెడీ చేశారు.
నేటివిటీ బలంగా ఉండనుండటంతో అక్కడి ఆర్టిస్టులనే తీసుకోవాలని బుచ్చి బాబు ప్రయత్నిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ అంటే గ్లామర్ హీరోయిన్ సెట్ అవదు. పెర్ఫార్మెన్స్ కు డిమాండ్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి హీరోయిన్ విషయంలో బుచ్చి బాబు పలు ఆప్షన్స్ వెతుక్కుంటున్నాడట. మధ్యలో రవీనా టండన్ కూతురికి టెస్ట్ కట్ కూడా చేశారు కానీ ఆ రిజల్ట్ తో బుచ్చిబాబు శాటిస్ఫై కాలేదని సమాచారం. దీంతో బుచ్చిబాబు అనుకున్న లక్షణాలన్నీ కావాలంటే సాయి పల్లవి రావాలి. కానీ సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరి చరణ్16కు ఫైనల్ గా ఏ హీరోయిన్ ఎంపికవుతుందో చూడాలి.













