బిగ్‌బాస్ సీజన్8 కు వెళ్లబోయేది వీరే!
తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కు రెడీ అవుతుంది. బాలయ్యను హోస్ట్ గా అడిగే అవకాశాలున్నట్లు టాక్ వచ్చింది కానీ ఈ సీజన్ కూడా హోస్ట్ గా ఆల్మోస్ట్ నాగ్‌నే ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఇదిలా ఉంటే ఈ లోపు బిగ్ బాస్ సీజన్ 8 కోసం కంటెస్టెంట్స్ లిస్ట్ ను రెడీ చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది పేర్లు కూడా లీకయ్యాయి. వారిలో వంటలతో పాటూ తన పిలుపుతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ, సెలబ్రిటీల జాతకాలతో పాపులరైన వేణు స్వామి, నెల్లూరు చేపల పులుసుతో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ పేర్లు ఈ లిస్ట్ లో వినిపిస్తున్నాయి.
వీరితో పాటూ బర్రెలక్క, టీవీ ఆర్టిస్టులు తేజస్విని, హారిక, అక్షిత, సాయి కిరణ్, స్టాండప్ కమెడియన్ కుషిత కూడా ఇందులో ఉన్నారు. సురేఖా వాణి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆమె కూడా ఈ లిస్ట్ లో యాడ్ అవుతుంది. రాజ్ తరుణ్ ని కూడా సంప్రదించారట కానీ ఇప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఇదిలా ఉంటే ఈసారి మరింత బలమైన గేమ్స్ ను సీజన్ 8 కోసం డిజైన్ చేస్తున్నారట యాజమాన్యం. సెప్టెంబర్ నుంచి ఈ షో మొదలయ్యే ఛాన్సుంది.













