ఆశ్చర్యపరుస్తున్న బిచ్చగాడు-2
బిచ్చగాడు సినిమా రిలీజైన టైమ్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా టైటిల్, పోస్టర్లు చూసి అసలిదేం సినిమా అనుకున్నారంతా. కానీ ఆ సినిమా రిజల్ట్ చూసి అందరూ షాకయ్యారు. కేవలం మౌత్ టాక్ తో ఆ సినిమా రికార్డ్ రేట్ కలెక్షన్లను సాధించింది. తెలుగులోనే రూ.30 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అప్పట్లో కొన్ని వారాల పాటూ ఏ సినిమా రిలీజై దానికి మంచి టాక్ లేకపోయినా వెంటనే బిచ్చగాడు ఆ సినిమాను రీప్లేస్ చేసేది.
ఆఖరికి మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాపై కూడా ఈ బిచ్చగాడు ఎఫెక్ట్ పడిందంటే బిచ్చగాడు సినిమా రేంజ్ ని అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ ఒక్క సినిమాతో విజయ్ ఆంటోనీ తన క్రేజ్ ని పెంచుకుని, తన తర్వాతి సినిమాలన్నింటినీ చకచకా రిలీజ్ చేసుకున్నాడు. కానీ అవేమీ బిచ్చగాడులా ఆడలేదు.
అలా కొన్ని సినిమాల తర్వాత టాలీవుడ్ లో విజయ్ ఆంటోనీని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు తెలుగు ఆడియన్స్. సరిగ్గా అలాంటి టైమ్ కు విజయ్ బిచ్చగాడు-2 అంటూ మరోసారి తెరపైకి వచ్చాడు. విజయ్ మార్కెట్ అప్పటికే బాగా డౌన్ఫాల్ అయింది. దానికి తోడు బిచ్చగాడు2 ట్రైలర్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుంటుందో అనుకున్నారు. కానీ బిచ్చగాడు2 కలెక్షన్లు చూస్తుంటే అందరికీ మతిపోతుంది.
ఫస్ట్ డే ఏకంగా రూ.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మార్నింగ్ షో లతో పోలిస్తే మ్యాట్నీ లకు వసూళ్లు పెరిగాయి. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ కూడా అయ్యాయి. శనివారం ఆక్యుపెన్సీలు, వసూళ్లు అంచనాలకు మించే ఉన్నాయి. రిలీజ్ టైమ్ కు అన్నీ వ్యతిరేకంగానే ఉన్నప్పటికీ ఈ సినిమాకు రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్సే వస్తోంది. ఈన్ని బట్టి బిచ్చగాడు బ్రాండ్ వాల్యూ ఆడియన్స్ లో ఎంత స్ట్రాంగ్ గా నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.













