బాలీవుడ్ కు భాగమతి
తెలుగు సినిమాలు బాలీవుడ్లో సత్తా చాటుతున్నాయి. ఇక్కడ విజయం సాధించిన చిత్రాలను హిందీలో రీమేక్ చేసి హిట్ కొడుతున్నారు. తాజాగా అనుష్క నటించిన భాగమతి కూడా రీమేక్ కాబోతుంది. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా అశోక్ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ థ్రిల్లర్ భాగమతి గతేడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిది. దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసింది. తాజాగా దీన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. తెలుగు దర్శకుడు అశోక్ హిందీలో కూడా దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో అనుష్క పాత్రలో భూమి పడ్నేకర్ కనిపించనున్నారు. టాయిలెట్, ఏక్ ప్రేమకథ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తుంది.













