హిందీ బిగ్ బాస్ లోకి నటి భూమిక చావ్లా

సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రలు పోషిస్తున్నారు భూమిక. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కొన్ని చిత్రాలు సెట్స్ మీదున్నాయి. లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన ఆమె ప్రతి రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. అయితే భూమికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హిందీ బిగ్‌బాస్ తాజా సీజన్ ఆమె పార్టిసిపేట్ చేయబోతుందని టాక్. భూమిక కూడా ఆసక్తిగా ఉందని బాలీవుడ్ టాక్. త్వరలో సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ ఈ నెల 15 ప్రారంభం కానుంది.